Wednesday, 19 October 2016

స్వామీ సచ్చిదానంద బోధలు - 60



 భగవంతుడు అంతటా వ్యాపించిన సర్వాత్మ. కాన శ్రీరాముడు త్రేతాయుగంలో మాత్రం ఉండినాడనే భావనను మరచి, ఇప్పుడూ ఇచటనే రామాయణకథ జరుగుచున్నదని భావించడంవల్ల భగవన్నామం ఇంకా ఎక్కువ కళతో శోభిల్లుతుంది. భక్తుడు శ్రీరామనామాన్ని ఏకాగ్రతగా జపిస్తూ, తన జపాన్ని శ్రీరామచంద్రుడు అంతటా వింటున్నాడని భావిస్తే, అతనికి శ్రీరాముని కృపాకటాక్షం తప్పక లభింపగలదు.

No comments:

Post a Comment