శ్రేయస్సు ఎచ్చటా లేదు. అది తనలోనే ఉంది.
విషయాలను కోరకుండా, ‘పరమాత్మయే నాకు కావాలి’ అనే పట్టుదలతో, వైరాగ్యంతో భక్తులను
సేవిస్తూ, చిత్తశుద్ధిని పొంది, భగవంతునివైపు తిరిగినవారికి ‘సచ్చిదానందమైన బ్రహ్మము
అంతటా ఉందనీ, అదే తన ఆత్మ’ అని నిస్సంశయంగా బోధపడును. ఇదే ఉపనిషత్తుల ప్రధానమైన
ఉపదేశం.
No comments:
Post a Comment