అన్ని దానాల్లో బ్రహ్మదానం
గొప్పదని శ్రుతిస్మృతులు చాటుతున్నాయి. శ్రీశంకర భగవత్పాదులవారు ఇట్టి బ్రహ్మదానం
చేసిన మహామహులు. బ్రహ్మదానం అంటే బ్రహ్మవిద్యాదానం. బ్రహ్మవిద్యాదానంలో అన్ని
దానాలు అంతర్గతం. శ్రీసద్గురువుల ద్వారా ఆత్మవిద్యను పొంది, శ్రీశంకరులకు ఇష్టమైన
బ్రహ్మదానం ఆచరించడం కన్నా గొప్ప ఉపకారం వేరే లేదు. ఇదే శ్రీశంకరజయంతి ఉద్దేశం.
No comments:
Post a Comment