శరీరం ఒక కోట గోడ
ఉన్నట్లు, ఇంద్రియాలు అందలి కీలకస్థానాలు. కోటకట్టడం ఎక్కడెక్కడ సడలి ఉంటుందో అక్కడక్కడ
శత్రువులు ఆ కోటను భేదించడానికి ప్రయత్నిస్తారు. శరీరం, ఆరోగ్యం, కాంతి. బలం, శుచి-
ఇదంతా ఇంద్రియాల ఆరోగ్యం. కాంతి, బలం మున్నగునవి శుచిని అవలంబించి ఉంటాయి. కాన
శరీరాన్ని బయట శుచిగా ఉండులాగున చేసుకొంటే చాలదు. వివేకి ఇంద్రియాలను శుచిగా ఉంచుకోవడానికి
కృషి చేయటం ముఖ్యం. దీనవల్ల శరీరమనే కోటపై కామాది శత్రువుల దాడి ఉండదు.
No comments:
Post a Comment