మీరు నిత్యానందసాగరంలోనే ఉంటూ, విషయాలనే
ఉప్పునీరు త్రాగడానికై ఆరాటపడుతున్నారెందుకు? మీకు దుఃఖమనే దప్పిక తీరాలా?
అలాగైతే, వెంటనే మీలోనే సదా ఉంటున్న పరమాత్మ వైపు తిరగండి. పరమాత్మ అంటే ఎవరో
కాదు, అతడు మీ ఆత్మ. ఆత్మను గురించి జ్ఞానులవల్ల వినండి. మననం చేయండి, అపుడు
ఆనందమే మీ నిత్యస్వరూపమని గ్రహించి, శాంతులవుతారు.
Sunday, 25 September 2016
స్వామీ సచ్చిదానంద బోధలు - 57
పరమార్థం, వ్యవహారం అని రెండు వస్తువులు
లేవు. జనులు దేనిని వ్యవహారం అంటున్నారో, దానినే జ్ఞానులు శాస్త్రదృష్టిచే
పరమార్థం అంటున్నారు. కావున, మనం వ్వవహారాన్ని వదలి పరమార్థాన్ని పరిగ్రహించే పని లేదు.
వ్వవహారాన్నే పరమార్థంగా మార్చుకునే నేర్పరితనాన్ని సంపాదించవలె. అంతే.
Saturday, 24 September 2016
స్వామీ సచ్చిదానంద బోధలు - 56
ద్రాక్షతీగెలో అంతటా
ద్రాక్షరసం నిండి ఉంటుంది. కాని అది మనకు కనిపించదు. ఆ రసం పక్వమైన పండ్లలో
విశేషరూపంలో తెలుస్తుంది. ఇలాగే ఆత్మ సకల విశ్వానికి ‘రసోహమప్సు’ అన్నట్టు రసస్వరూపంగా
ఉంటుంది. ద్రవపదార్థాలలో అనగా పాలు, పానకం చెఱుకు రసం, మున్నగువాటిలో రసరూపంలో
తెలుస్తున్నాడు. కనుక ‘రసో వై సః’ ఆత్మ రసస్వరూపుడు అనగా ఆనందస్వరూపుడు అంటుంది శ్రుతి. అన్ని
వస్తువుల్లో పరమాత్మరసం వ్యాపించి ఉంది.
Subscribe to:
Comments (Atom)