Wednesday, 7 September 2016

స్వామీ సచ్చిదానంద బోధలు - 27

భాష, వేషం, ఆచారం, విచారం, వయస్సు, కులం, గోత్రం, వర్ణం, లింగం మున్నగు భేదాలచే జనులు పరస్పరం విలక్షణంగా కనిపిస్తున్నా కూడా అందరిలో ప్రకాశించే సర్వసాక్షియైన పరమాత్మ ఒక్కడే. సూర్యుని ప్రతిబింబాలు వేర్వేరు పాత్రలయందలి జలంలో కనిపించేటప్పుడు నీటి అల్పత్వం, మహత్త్వం, నిర్మలత్వం, మలినత్వం మున్నగు భేదాలననుసరించి వేర్వేరుగా కనిపించినా కూడా అవి ఒకే సూర్యుని ప్రతిబింబాలే కదా.

No comments:

Post a Comment