Wednesday, 7 September 2016

స్వామీ సచ్చిదానంద బోధలు - 14

బ్రహ్మ సత్యం జగన్మిథ్యా అనే శంకరుల సిద్ధాంతంలో జగత్తుకు విలువ లేనందున ‘శాంకరవేదాంతం మానవజీవితానికి పనికిరానిద’ని భావిస్తే అది భ్రాంతే. ‘జగన్మిథ్య’ అంటే ‘జగత్తు లేనే లేద’ని కాదు. జగత్తు తాను తోచే రూపంలో సత్యం కాదనీ, దాని పరమార్థం బ్రహ్మమేనని అర్థం. ఇపుడు జగత్తుకు ఇంకా ఎక్కువ విలువ ఏర్పడిందే గాని, తగ్గలేదు. దీనివల్ల ‘తన ఆత్మయే సకల ప్రాణుల ఆత్మ’ అని మానవుడు గుర్తించి, పరోపకారం, భూతకారుణ్యం మున్నగు దివ్యగుణాలచే ప్రకాశించి, జగత్తును నందనవనంగా మార్చగలడు.

No comments:

Post a Comment