ఇంటిలో తమ పెద్దలు ఎప్పుడో నేలలో గొప్ప
నిధిని పూడ్చారనుకోండి. వారు దానిపైన తిరగాడుతున్నా, తమకు తెలియకుండా
దారిద్య్రాన్నే అనుభనిస్తున్నారు. కాని ఒకానొక నిధిశాస్త్రజ్ఞుడు వచ్చి, కంటికి
అంజనం వేస్తే, నేల లోపల గల మహానిధి గోచరించింది. ఇట్లే, మీలో ఆధ్యాత్మనిధి ఉంది
కాని, అది తెలియనందున దుఃఖం అనుభనిస్తున్నారు. సద్గురువులు మనోనేత్రానికి
జ్ఞానాంజనం వేసినపుడు అజ్ఞానమనే పొర తొలగి అక్షయమైన ఆధ్యాత్మనిధి మీ వశమవుతుంది.
No comments:
Post a Comment