Wednesday, 7 September 2016

స్వామీ సచ్చిదానంద బోధలు - 30

మానవుని జీవితం ఒక ప్రయాణం. ఈ శరీరమే బండి, ఇంద్రియాలే గుఱ్ఱాలు, బుద్ధియే బండిని నడిపేవాడు, మనస్సే కళ్ళెం. తానే బండి యజమాని. తన ప్రయాణం సుఖంగా సాగవలెనంటే బండి, గుఱ్ఱాలు, బండిని నడిపేవాడు – ఇవన్నీ సరిగా ఉండాలి. అప్పుడే ప్రయాణం ఎలాంటి ఒడిదొడుకులు లేక ముందుకు సాగుతుంది. సదాచారం వల్ల శరీరం, ఇంద్రియాలు, బుద్ధి సురక్షితములై అధ్యాత్మ ప్రయాణం నిరాటంకంగా జరిగి నిత్యసుఖమనే గమ్యాన్ని చేరుకోగలం.

No comments:

Post a Comment