మన ఆత్మయే సర్వవ్యాపకమైన
పరమాత్మ. అయితే మన ఆత్మ మనకేల గోచరించ లేదు? అని ముముక్షువులు శంకిస్తారు. పగలు అంతటా
సూర్యరశ్మి వ్యాపించింది. కాని ఒకడు తన ఇంటి తలుపులను, కిటికీ తలుపులను మూసుకొని ‘నాకు
వెలుతురు లేదే’ అని ఎందుకు వ్యథ పొందాలి? కటికీ తలుపులు తీస్తే చాలు, ఇంతకు ముందున్న
వెలుతురే ఇంటిలోకి ప్రవేశించునట్లు, మన శరీరం, ఇంద్రియాలు, మనస్సు మున్నగునవే
పరమాత్మకు అడ్డంగా ఉన్నాయి. వాటిని పరమాత్మ వైపు త్రిప్పితే ఉన్న ఆత్మ ఉన్నట్లే
తెలుస్తుంది.
No comments:
Post a Comment