Wednesday, 7 September 2016

స్వామీ సచ్చిదానంద బోధలు - 22

మాకు ఇల్లూ, వాకిలీ, పొలం, నగలూ, నట్రా వగైరా ఆస్తులున్నాయి గనుక ఏ భయం లేకుండా మన జీవతం సాఫీగా, సుఖంగా సాగిపోతుందని అనుకుంటే, అది పొరపాటే. ఇదంతా ఆసురీసంపద. ఇది మనం చనిపోయేటప్పుడు వెంట రాదు. ఇది దుఃఖదాయకం, కానీ సత్యం, ధర్మం అనే దైనీసంపదను మీరు సంపాదించండి. అదే మీకు ఇహంలోనూ, పరంలోనూ సుఖాన్ని ఇచ్చేదే గాక దానివల్ల మన స్వరూపమైన అద్వయాత్మలో నెలకొనవచ్చు. అప్పుడు సుఖశాంతులను బైట వెదికే దారిద్ర్యమే లేదు. అపుడు మనమే సుఖశాంతి స్వరూపులం.

No comments:

Post a Comment