ఆయా రంగుటద్దాల ద్వారా చూసేవారికి ఆయా
వస్తువులు ఆయా రంగుల్లో కనిపించినట్లు ఇంద్రియాల ద్వారా, మనస్సు ద్వారా చూసేవారు
ఆయా వస్తువుల్లో రాగద్వేషాలు కలిగి, కామవశులై ఆయా కర్మలు చేస్తూ, అనిత్య ఫలాన్ని
అనుభవిస్తూ తిరుగుతున్నారు. శంకర వేదాంత బోధవల్ల సార్వత్రిక అనుభవ దృష్టిని
అవలంబించినపుడు అంతా అఖండమైన అద్వయమైన తన ఆత్మయే పరమార్థమని గ్రపించి, శోకమోహాలను
పోగొట్టుకుని సద్యోముక్తిని పొందుచున్నారు.
No comments:
Post a Comment