చైతన్యరూపమైన ఆత్మయే జ్యోతులకెల్లా జ్యోతి.
చంద్రుని ప్రకాశం వాస్తవంగా సూర్యునిదే. చంద్రునకు స్వయంప్రకాశం లేదు. ఆత్మప్రకాశం
ఇలాంటిది కాదు. దీని స్వరూపమే జ్యోతి. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, మెరుపులు
మున్నగువాటి ప్రకాశం కూడా ఆత్మదే. వేడినీటి వేడిమి నీటిది కాదు కదా. ఇతడు
ధనికులకెల్లా, గొప్ప ధనికుడు (కుబేరుడు) అన్నపుడు ధనికులకూ ఇతడు ధనం ఇచ్చేవాడని కదా.
వారి ధనికత్వం అంతా ఇతనిదే. ఇట్లే, ఆత్మ సకల జ్యోతులకు జ్యోతి.
No comments:
Post a Comment