Wednesday, 7 September 2016

స్వామీ సచ్చిదానంద బోధలు - 34

భక్తుడు సదా మనోబుద్ధులను పరమాత్మకే సమర్పించి ఉంటాడు. బెంగళూరులో ఒక మహనీయుడు. వారివద్ద మనమెవరైనా ఇతరుల విషయాన్ని గురించి మాటాడితే ‘అది అలా ఉండని, పరమాత్మవిచారం చెప్పండి’ అని ఏదైనా ఒక తాత్త్విక విషయాన్ని మొదలుపెట్టేవారు. వెంటనే పరమాత్మవైపు మన చిత్తాన్ని లాగేవారు. పనికిమాలిన మాటలను వదిలిపెట్టి పరమాత్మ వైపే మన లక్ష్యం ఉంటే పరమశాంతి లభిస్తుంది.

No comments:

Post a Comment