128. సంగం అంటే అంటు. పనసపండును ఒలిచేటప్పుడు చేతికి చమురు రాసుకుంటే, దాని
అంటు మనకు అంటదు. ఇలాగే కర్మను చేసేటపుడు ‘దీనిని ఈశ్వరునికై చేస్తాను’ అనే
చమురును మీ బుద్ధికి పూసుకోండి. అప్పుడు కర్మఫలభోగాల అంటు మీకు అంటుకోదు. ఏ కర్మను
చేసినా ‘దీనిని నేను చేస్తున్నాను’ అనే సంగం కాని, ఫలాశ కాని ఉండరాదు. కాకరకాయ,
దోసకాయ మున్నగు కాయల చేదును వంటవారు తీసివేసినట్లు, కర్మయొక్క చేదును భగవదర్పణం
ద్వారా తీసివేయండి. కర్మయొక్క చేదును భగవదర్పణం ద్వారా తీసివేయండి, అపుడే మిమ్మల్ని
కర్మ ఉద్ధరించేది.
Monday, 10 July 2017
స్వామీ సచ్చిదానంద బోధలు - 127
127. కొందరికి ‘నాకు అహంకారం లేద’నే అహంకారం ఉంటుంది. వారు నాకు ఏమీ
అక్కర్లేదు అని అంటూ తనకు గొప్ప విరక్తి ఉన్నట్లు ప్రదర్శిస్తారు. అందరూ తనను
గొప్పవాడని, విరక్తుడని తెలుసుకోకపోతే చాలా బాధపడతారు. నటనజీవితాన్ని గడపటం వారి
పద్ధతి. ఒక పిల్లి తాను సంసారంలో విరక్తి పొందినానని శరీరానికి అంతా భస్మం
పూసుకొని త్రిపుండ్రం ధరించి, ఒక చెట్టు క్రింద తపస్సు చేస్తూ ఉన్నట్లు నటించిందట.
ఇలా కొందరు విరక్తిని ప్రదర్శించటానికి ఆరాటపడతారు.
స్వామీ సచ్చిదానంద బోధలు - 126
126. అడవిలో ఒక ఎద్దు ఒకానొక చెట్టు చుట్టూ తిరుగుతూ ఉంది. అది ఎవరి ఎద్దని
విచారిస్తే, ఆది గానుగ ఆడించే వాడిది అని తెలిసింది. గానుగవాని ఇంట వార్ధక్యం
వచ్చేవరకు ఆ ఎద్దు పని చేసింది. వెనుకటి ఆలవాటు ప్రకారం అది చెట్టును చుడుతూ ఉంది.
ఇలాగే, ఉద్యోగంలో, వ్యాపారంలో చాలా కాలంగా ఉంటూ, పదనీ విరమణ పొందిన తర్వతనైనా
ఆత్మచింతన చేయక జనులు ఆయా సంస్థలకు సంఘాలకు డైరెక్టరుగానో, ఆధ్యక్షులుగానో
ఉండటానికి ఆరాటపడతారు. ఇలాంటి పని ఏదీ దొరకకపోతే ఎవరితోనైనా తన యౌవనంలో తాను ఆయా
పనులను ఎలా సాధించింది? మున్నగు విధాల తన గొప్పతనాన్ని చూపించుకుంటాడే గాని,
ఇప్పుడైనా పరమాత్మ స్మరణను, ఆత్మవిచారాన్ని అవలంబించి ధన్యుడు కావాలననే సంకల్పం
ఉదయించదు.
Subscribe to:
Comments (Atom)