Monday, 10 July 2017

స్వామీ సచ్చిదానంద బోధలు - 98

98. ఆయా కోరికలు కోరేవారు బుభుక్షువులు. భగవంతుడినే కోరేవారు ముముక్షువులు. భగవంతునికై భగవంతుడిని ప్రార్థించటం బుభుక్షువులకు తెలియదు. మనం కోరకపోయినా, భక్తుని కష్టాలను దేవుడు పరిహరిస్తాడు. ముముక్షువులకు మాత్రమే దేవుడు లభ్యమవుతాడు. భోగాలు, భగవంతుడూ రెండు కావాలనే వారికి పరమాత్మ దొరకడు. రాజసింహాసనంలో కూర్చోవాలని కోరేవాడు తన భిక్షాపాత్రను ఆవల విసిరి వేసి కదా కూర్చొనవలె! సింహాసనంపై భిక్షాపాత్రకు స్థలం ఎక్కడ?

No comments:

Post a Comment