94. ‘నేను’ అనే దాన్ని సమూలంగా పెరికి వేస్తానని హఠం పూనితే ప్రయోజనం లేదు. ఈ
హఠానికి అహంకారమే ఆధారశిల. అపుడు అది ఇంకా బలిష్ఠమవుతుంది. దానిలోని దోషాలను
మనస్సుకు తెచ్చుకోవటం వల్ల కొంత ప్రయోజనం చేకూరగలదు. అహంకారాన్ని కాల్చి బూడిద
చేయటానికి భక్తి ఒక్కటే పరమౌషధం. పరమాత్మ సర్వజ్ఞుడు, సర్వశక్తుడు, నిత్యు,
శుద్ధుడు – అనే జ్ఞానం ఉదయిస్తే అహంకృతి నామరూపాలు లేకుండా పోతుంది. అట్టి
జ్ఞానానికై శమాదులను, భక్తివైరాగ్యాదులను సంపాదించటం మొదటి కర్తవ్యం.
No comments:
Post a Comment