93. ప్రభుత్వాధికారులు, గొప్ప పదవులలో ఉన్నవారు పార్లమెంటు సదస్యులు, వేర్వేరు
దేశనాయకులు మున్నగువారు నడుచుకున్న తీరున కొందరు వార్తాపత్రికల్లో చదివి, ‘వారు
నేర్పరులు, వారు అంత బుద్ధివంతులు కారు’ మున్నగు విధాల విమర్శిస్తారు. తనకు ఏ
రాజకీయానుభవం లేకపోయినా, అంతా తెలిసినవాని వలె ‘నేను’ అనే వాడు నటిస్తూ ఉంటాడు.
తనకు అందరి నడతపై అభిప్రాయం తెలిపే యోగ్యత ఎక్కడిది? అని ఆలోచింపడు. ఇదే మాయా విలాసం.
No comments:
Post a Comment