105. దేహం, ఇంద్రియాలు, ప్రాణం, మనస్సు, బుద్ధి – ఇవి సదా మారుతూ ఉంటాయి. వీటి
సౌందర్యం, ప్రయోజనం స్మరించీ, స్మరించీ మూఢజనులు పొంగిపోతారు. కలలో మనకు ఎన్నో
దేహాలు, ఇంద్రియాలు తోస్తాయి. అపుడు వాటిలో ఎంతో అభిమానం కలిగి ఉన్నా, మనం
మేల్కొన్న వెంటనే ఆ అభిమానాన్ని నీళ్ళపాలు చేస్తున్నాం కదా? ఇంతేగాక, దేహాదులలో
నాది అనే అభిమానం పూనరాదు. లేదా అలా అభిమానం పెట్టుకున్నా, అవి మనకు హితాన్ని
కల్గించునట్లు వాటిని ఉపయోగించడం అభ్యసించండి.
No comments:
Post a Comment