Monday, 10 July 2017

స్వామీ సచ్చిదానంద బోధలు - 109

109. గురువుతో వాదోపవాదాలు చేయరాదు. అతని ఉపదేశామృతాన్ని త్రాగడానికై తన చెవులను ఆయత్తపరచాలి. తాను తెలుసుకొన్నదానిని గురువుకు తెలుపుటకు తాను గురువుల సమీపించినాడా? కాదు. బీదవాడు ధనికునితో, ‘అయ్యా మీకేమైనా డబ్బు కొదువ ఉంటే నన్ను అడగండి’ అని అంటాడా? లేదు. ఇలాగే గురువుల వలన సత్య తత్త్వన్ని గ్రహించి, ధన్యుడగుటయే తన కర్తవ్యమని సాధకుడు నిశ్చయింపవలెను.

No comments:

Post a Comment