Monday, 10 July 2017

స్వామీ సచ్చిదానంద బోధలు - 88

88. నేననే ఆభిమానం జ్వరం ఉన్నట్లు. జ్వరం ఉన్నవారకి ఉత్సాహం, శాంతి, నెమ్మది ఉండదు. జ్వరం నయం కావటానికి పథ్యం పాటించాలి కదా! అయోగ్యమైన కామములు త్యజించటమే పథ్యం. దంభం, అభిమానం, హింస, మోసం మున్నగు దోషాల సన్నిపాతం ఇట్టి జ్వరగ్రస్తులకు తప్పదు. ఆ అహంకారమనే రోగాన్ని భవరోగ వైద్యులైన మహాత్మల ఉపదేశాలతో పోగొట్టుకోవటమే మానవ జీవిత పరమావధి.

No comments:

Post a Comment