99. మతగ్రంథాలు, మతాచార్యులు మన స్వరూపాన్ని తెలుపుట వలన ముఖాన్ని
ప్రతిఫలింపజేసే అద్దం లాంటివారు. తన ముఖం ప్రతిబింబాన్ని కనుగొన్నవాడు ముఖం స్వరూపాన్ని
తెలిసికున్నానని భావించునే గాని, దర్పణం యొక్క ఆకారం, దాని సుందరత్వాదులకు
ఆకర్షితుడు కాడు. తన స్వరూపమైన సచ్చిదానందమును కనుగొనడమే సాధకుని ముఖ్యమైన
లక్ష్యం.
No comments:
Post a Comment