Monday, 10 July 2017

స్వామీ సచ్చిదానంద బోధలు - 127

127. కొందరికి ‘నాకు అహంకారం లేద’నే అహంకారం ఉంటుంది. వారు నాకు ఏమీ అక్కర్లేదు అని అంటూ తనకు గొప్ప విరక్తి ఉన్నట్లు ప్రదర్శిస్తారు. అందరూ తనను గొప్పవాడని, విరక్తుడని తెలుసుకోకపోతే చాలా బాధపడతారు. నటనజీవితాన్ని గడపటం వారి పద్ధతి. ఒక పిల్లి తాను సంసారంలో విరక్తి పొందినానని శరీరానికి అంతా భస్మం పూసుకొని త్రిపుండ్రం ధరించి, ఒక చెట్టు క్రింద తపస్సు చేస్తూ ఉన్నట్లు నటించిందట. ఇలా కొందరు విరక్తిని ప్రదర్శించటానికి ఆరాటపడతారు.

No comments:

Post a Comment