Monday, 10 July 2017

స్వామీ సచ్చిదానంద బోధలు - 112

112. ఒక పెళ్ళి సమారంభంలో బంధువులకు, మిత్రులకు రుచికరాలైన భక్ష్యాలను వడ్డించారు. కాని అంతకు ముందే వారంతా ఫలహారం, కాఫి మున్నగు తిండితో తృప్తులైనందున ఆకలి లేదు కాన, వడ్డించిన భక్ష్యాలలో లోపదోషాలను కొందరు ఎత్తి చూపగా, మరికొందరు రాజకీయ ప్రసంగాలు ప్రారంభించారు. ఇలాగే, ఆధ్యాత్మవిచారంలో ఆకలి లేనివారికి ఎలాంటి గొప్పసాధన, సిద్ధాంతాలను బోధించినా, వారు అవేవీ పట్టించుకోక, ఉపదేశకుల జాతికులాలను విచారించడం, వారి వాక్యాలలో వ్యాకరణదోషాలను కనుగొనడం చేస్తుంటారు.

No comments:

Post a Comment