116. పల్లెలో ఉన్నవారికి పట్టణపు గలాటా సరిపడదు. రైలు, బస్సు స్టాండులకు
సమీపంలోనూ, పిండిమరల వద్దనూ వసించేవారు వాటి గలాటాను మనస్సుకు పట్టించుకోక, దానిని
మరచే తమ తమ వ్యవహారం చేస్తారు. ఇలాగే, పరమాత్మ ధ్యానంలో ఉన్నవారికి ఏ కొంత సద్దు
అయినా విక్షేపం అవుతుంది. అదే, లౌకికులకు, తమ ఇంట్లో జరిగే పిల్లల అల్లరి, వారి ఏడ్పులు,
జగడాలు వీణాధ్వనుల వలె ఇంపుగా ఉంటాయి.
No comments:
Post a Comment