Monday, 10 July 2017

స్వామీ సచ్చిదానంద బోధలు - 95

95. మన మనస్సున ఎలాంటి శ్రద్ధ ఉంటుందో, అట్టి గుణాలే మనలో వ్యక్తమవుతాయి. కనుక, ఈశ్వరునిపై మనకు గల శ్రద్ధచే దైవీ సంపద్గుణాలే మనలో ఉదయిస్తాయి. మనలో దేని భావం బలంగా ఉంటుందో, దానికి అనుగుణమైన సన్నివేశమే మన బయట కూడా కనిపిస్తుంది. కాన మనలో దైవీసంపద్భావన వ్యక్తమైనంత మేరకు మన పరిసరంలోనూ సుఖశాంతులు సమృద్ధిగా కనిపిస్తాయి. మనలో ఉత్తమభావన నాటితే అట్టి పంట మన చుట్టుముట్టు పండుతుంది.

No comments:

Post a Comment