107. శరీరం అనే శబ్దానికి (శీర్యతే) నశించేది అని అర్థం. దేహం అనే శబ్దానికి
(దహ్యతే) దహింపబడేది అని అర్థం. బ్రతికి ఉన్నపుడు చింత అనే అగ్గిచేతను, చనిపోయిన
పిదప చితియందును దహించిపోవును. ఇలాంటి నశ్వరమైన దేహంలో నాది అనే బుద్ధి పెట్టుకొనక,
క్షణికమైన శరీరంతో క్షణికసుఖాన్ని పొందక, అనిత్య శరీరంతో నిత్యమైన పరమాత్మను
కనుగొనడానికి యత్నించేవాడే బుద్ధిమంతుడు.
No comments:
Post a Comment