124. పిల్లలకు ఏ ఒక్క విషయంలోనూ అదే కావాలనే పట్టుదల ఉండదు. వారికి ఏ వస్తువు
చేతికి దొరికితే వాటినే ఆటవస్తువులుగా ఆడుకొంటారు. సదా నవ్వుతూ కాలం గడపటమే పిల్లల
స్వభావం. వారికి ఏదైనా ఆటంకం కలిగితే దుఃఖం కలగటం నిజం. కాని మరల ఏదేని ఒక వినోద
వస్తువు దొరికితే చాలు, వెంటనే మొదటి దుఃఖన్ని మరచిపోతారు. ఇలాగే సాధకుడు
పిల్లలవలె సదా నవ్వుతూ ఉండటాన్ని నేర్చుకోవాలి. ప్రియాప్రియాలు రాకపోకలు గలవని
తలచి, వాటిచే నెమ్మదిని పోగొట్టుకోరాదు.
No comments:
Post a Comment