104. కొన్ని సందర్భాలలో గ్రుడ్డివాళ్ళుగా, మూగవాళ్ళుగా, చెవిటివాళ్ళుగా,
కుంటివాళ్ళుగా ఉండటం ఒక సౌభాగ్యం అనిపిస్తుంది. అసభ్య దృశ్యాలను చూచే కన్నులు ఏల?
అసత్యం, పరనింద, ఆత్మస్తుతి, వ్యర్థాలాపాలు చేసే నోరు ఉంటేనేమి? లేకపోతేనేమి?
వాక్కు లేకపోవడం (మూగగా ఉండటం) మన మంచికే కదా! భగవంతుని గుణకర్మలీలలు వినక,
ఈశ్వరనింద, సాధునింద మున్నగు దుష్టవిషయాలను వినే చెవులేల? తీర్థయాత్రలను,
మహాత్ములను దర్శించటం వీడి, జూదం, మద్యం, దుష్టుడు మున్నగు కలిస్థానాలకు వెళ్ళే
కాళ్ళు ఏల? దానం, ధర్మం చేయని చేతులేల?
No comments:
Post a Comment