పరమాత్మను ధ్యానించడానికి మనస్సును
ఉపయోగించినా, కడకు ఆత్మ చేతనే ఆత్మను కనుగొంటాము. బండిలో కూర్చొని ఇంటికి
వచ్చినవాడు, బండి దిగి ఇంటిలో ప్రవేశించు లాగున, మనస్సును వదలిపెట్టి తన్నుతాను
కనుక్కొంటాడు. కాని, మనస్సుతో ఆత్మను కనుక్కోడు. ఎందుకంటే, మనస్సుకు ఆత్మ విషయం
కాదు. మనస్సే ఆత్మకు విషయం. ధ్యానంవల్ల శుద్ధమైన మనస్సు గలవారికి తప్పక ఆత్మజ్ఞానం
ఉదయిస్తుంది. ఇదే పరమాత్మ అనుగ్రహం.
No comments:
Post a Comment