‘శ్రుణ్వన్తు విశ్వే అమృతస్య పుత్రాః’ – “ఓ
అమృత పుత్రులారా, వినండి”. మృత్యువుకు ఎవ్వరూ భయపడే పని లేదు. మనమంతా
అమృతపుత్రులం. మన స్వరూపమైన పరమాత్మ మృత్యువుకు మృత్యువు. ‘మృత్యుర్ధావతి’ అని
శ్రుతి. అంటే పరమాత్మను చూచి మృత్యువు పరుగెత్తవలసిందే. శివభక్తుడైన మార్కండేయుని
ప్రాణం హరించటానికి యముడు భయపడినట్లు జ్ఞానిని చూస్తే మృత్యువుకూ భయమే. ఎందుకంటే,
ఆ మృత్యువుకూ జ్ఞాని ఆత్మయై ఉన్నాడు. ఈ రహస్యన్ని సద్గురువుల వల్ల విని, తన ఆత్మ అమృతమని
తెలుసుకొంటే, తానే మృత్యుంజయుడు.
No comments:
Post a Comment