Saturday, 10 September 2016

స్వామీ సచ్చిదానంద బోధలు - 48



      బయటి విషయాలను చూడటానికి అంతఃకరణాన్నీ, ఇంద్రియాలనూ ఉపయోగించేవారి దృష్టిని పరాగ్దృష్టి అని అంటారు. మన అంతఃకరణం యొక్క స్వరూపం, స్థితి, వ్యవహారం – వీటికి ఆధారంగా ఉంటున్న ఆత్మను కనుగొనేందుకు ఉపయోగించే దృష్టికి ప్రత్యగ్దృష్టి అని పేరు. ఆధ్యాత్మిక విద్యకు ప్రత్యగ్దృష్టి అవసరం. అంతఃకరణం ఈ దృష్టిని అవలంబించినప్పుడే దానికి అంతఃకరణం అనే పేరు సార్థకమవుతుంది.

No comments:

Post a Comment