విశ్వమందలి అన్ని శక్తులకు మూలం పరమాత్మయే.
ఆయా వస్తువుల్లో, వ్యక్తుల్లో కనిపించే శక్తి ఆయా వస్తువులదే అని భ్రమించరాదు. వేడినీరు
అన్నపుడు వేడిమి అగ్నిదే కాని, నీటికి సంబంధించినది కాదు కదా? ఇలాగే సకల
వ్యక్తుల్లోని, వస్తువుల్లోని శక్తి అంతా పరమేశ్వరునిదే. అజ్ఞానులు తమయందలి శక్తి
తమకు సంబంధించినదే అని భ్రాంతులై అహంకరిస్తారు. నిజంగా ఆ శక్తి తనలోని పరమాత్మనుండి
వచ్చిందే అని ధీరులు మాత్రం గ్రహిస్తారు.
No comments:
Post a Comment