Saturday, 24 September 2016

స్వామీ సచ్చిదానంద బోధలు - 55



    కాపలాదార్లు చెఱసాలలో వెళ్తూ, వస్తూ ఉంటారు. కాని ఖైదీలు బద్ధులై, దుఃఖగ్రస్తులై ఉంటారు. కాపలాదార్లు మాత్రం ఎలాంటి దుఃఖం లేక స్వతంత్రంగా ఉంటారు. ఇలాగే లోకంలో అజ్ఞానులు, జ్ఞానులు వ్యవహరిస్తున్నా కూడా వీరిలో అజ్ఞానులు సంసారబద్ధులై, దుఃఖంతో వ్యవహరిస్తున్నారు. జ్ఞానులు సంసారాన్ని అంటక కర్తృత్వబుద్ధి లేనివారై స్వతంత్రులై ఆనందంగా జీవితం గడుపుతున్నారు.

No comments:

Post a Comment