పత్రం, పుష్పం, ఫలం, జలం ఏవీ లేవనీ, నాకు
తీరిక లేదనీ, ఏవేవో కుంటిసాకులు చెప్పి, దేవుని పూజను తప్పించుకోలేరు. కడకు మీ
బ్రతుకుతెరువుకై అవలంబించిన కర్మచేతనైనా ఈశ్వరుణ్ణి పూజించండి. అనగా కర్తవ్య కర్మను
ఫలం కోరకుండా, అభిమానం లేకుండా ఈశ్వరార్పణ బుద్దితో చేయండి. అదే నిజమైన దేవుని పూజ.
ఇదే గీతాచార్యుని దివ్యోపదేశం. దీనివల్ల వ్యక్తి కల్యాణమే కాదు, లోకకల్యాణమూ చేకూరుతుంది.
No comments:
Post a Comment