నాటకంలో తెర ప్రక్కకు తొలగిన వెంటనే
పాత్రదారులు కనిపించినట్లే- నేను, నాది అనే తెర తొలగిన వెంటనే భగవంతుని జ్ఞానం
కలుగుతుంది. అంతా ఈశ్వర విభూతియే కావున నేను, నాది అనేది మిథ్యాభావన. జగత్తున
ఉత్కృష్టమైన వస్తువులను పరమాత్మ విభూతిగా భావిస్తూ క్రమంగా అఖండవిశ్వాన్నే పరమాత్మ
విభూతి అని భావించినవారికి నేను, నాది అనే అభిమానం తొలిగి శాశ్వతానందం లభిస్తుంది.
No comments:
Post a Comment