శరీరాన్ని తన ‘ఆత్మ’ అని నమ్ముకుంటే ఒకానొక
దినం ఈ లోకంలోని సుఖాలన్నింటిని విడిచి వెళ్ళవలసి ఉంటుంది. దీనికంటే శాస్త్రీయ
కర్మలను నిష్కామంగా ఆచరించి, మనస్సును నిర్మలం చేసుకొని, పరమాత్మ యందే నెలకొనటం
వల్ల లభించే ఆనందం అన్నింటికి మిన్న. దీనితో పోలిస్తే మిగిలినదంతా పిప్పియే.
మానవజన్మ పొందినందుకు భగవంతుని ధ్యానించి, శ్రేష్ఠమైన ఆనందమును సంపాదించటమే ముఖ్యం.
No comments:
Post a Comment