భగవంతుడు ఒక చైతన్యసాగరం. మనమంతా అందు
చేపల వంటివారం. భగవంతుని ఉనికే మన ఉనికి. చేపలు తమ కుడివైపు, ఏడమవైపు, పైనా,
క్రింద అంతటా నీరు ఉన్నా కూడా ‘నీరు ఎక్కడుంది?’ అనడం ఎలా హాస్యస్పదమో, అలాగే మనం
భగవంతునిలో ఉంటున్నా కూడా ‘భగవంతుడు ఎక్కడున్నాడు?’ అని అడగటం కూడా అంతే
హాస్యాస్పదం. కావున, సాధకులు ‘నేను భగవంతుని యందే ఉన్నాను’ అనే దృఢవిశ్వాసాన్ని
పెంపొందించుకోడానికి కృషచేస్తే, తమ జీవితమహిమ ఏమిటో బోధపడగలదు.
No comments:
Post a Comment