అన్ని ప్రాణుల్లో కూటస్థ నిత్య చైతన్య స్వరూపంచే
ఉంటూ, కేవలుడూ, నిర్గుణుడు అయిన సర్వసాక్షియే భగవంతుడు. అతడు నిర్గుణుడు అవ్వటం వల్ల
అతనికి ప్రియులూ, అప్రియులూ లేరు. అయినా, అగ్ని తన స్వభావంచేత వేడిగా ఉంటూ, తన
వద్దకు వచ్చిన వారికి చలిని పోగొట్టినట్లే ‘అతడే మనందరి ఆత్మ’ అని ఎవరు ప్రేమతో
భజిస్తారో, వారిలో ఉంటూ, వారిని విశేషంగా అనుగ్రహిస్తాడు.
No comments:
Post a Comment