Wednesday, 30 November 2016

స్వామీ సచ్చిదానంద బోధలు - 64

64. మనకు బయట మాత్రం శత్రువులున్నారని జనులు అనుకున్నారు. కాని కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం అనే ఆర్గురు శత్రువులు తమ లోపల ఉండటం గుర్తించరు. కామాదుల వలన తనకు చెడుపు కలిగనపుడు క్రోధం వలన చెడిపోయి, మదం వలన నాకు ఈ దుర్గతి పట్టింది అంటూ, వాటి వలన తనకు హాని కలుగుచున్నదని అప్పుడు గుర్తిస్తాడు. విషయాలను ఆశ్రయింపక పరమాత్మను ఆశ్రయిస్తే ఈ శత్రువులు తప్పకుండా పలాయనం చిత్తగిస్తారు.

No comments:

Post a Comment