‘సాంఖ్యం’ అంటే తత్త్వజ్ఞానం. ఆత్మను
గురించి విచారించాలి. ఊరికే కుతూహలంతో విచారిస్తే చాలదు. సంశయాలన్నీ తొలగే దాకా
సద్గురువుల నుండి శ్రవణం చేయాలి. దానినే మననం చేయటం అవసరం. ఆ తత్త్వమే తాను అయ్యేవరకు
అనుసంధాన రూపమైన నిదిధ్యాసనం చేయటం ముఖ్యం. ఇట్టివారికి వలదన్నా తప్పక ముక్తి
లభిస్తుంది.
No comments:
Post a Comment