ఒక ఊరి దగ్గర చెఱువులో
స్నానం చేయటం, పశువులను కడగటం, అంట్లు తోమటం, గుడ్డలను ఉతకటం ఇత్యాదులు చేయటంవల్ల
అందులో నీరు కలుషితమై జనుల అనారోగ్యానికి కారణం అవుతుంది. ఇలాగే మనస్సున చాలా
కాలంగా విషయాల పట్ల, ప్రాణుల పట్ల రాగద్వేషాలు పూనడం వల్ల మనస్సు కామక్రోధాలతో
కలుషితమై అనర్థాలకు దారి తీస్తుంది. అలా కాకుండా సదాచారం, భగవచ్చింతనం మున్నగు
సాధనాలతో మనస్సు శుద్ధం కాగా, పరమాత్మతత్త్వం తనకు తానే స్ఫురిస్తుంది.
No comments:
Post a Comment