శ్రీకృష్ణభగవానుడు గోపాలుడై జనులను
ఉద్ధరించాడు. గోవుల వలన జగత్కల్యాణం చేకూరుననీ గోవులను గౌరవించటం, సేవించటం
మహాపుణ్య కార్యాలనీ ప్రబోధించాడు. బయటి గోవులే కాక, ఇంద్రియాలు అనబడే గోవులను
సన్మార్గంలో నడిపించాలని అతడు బోధించాడు. గోపాల పశుపతే అని స్మరించండి – మన ఇంద్రియాలను
సదాచారం, సద్విచారాల వైపు మరలించి, శోకవిముక్తి ప్రసాదించుమని ప్రార్థించండి.
No comments:
Post a Comment