గాఢనిద్రలో ‘నేను’ అనే జీవుడు తోచడు. ‘నేను’
ఇప్పుడు మాత్రమే తోస్తున్నందున జీవుడు మిథ్య. కాబట్టి అహంకారానికి సాధకుడు విలువను
ఇవ్వరాదు. గాఢనిద్రలో నీవు, వారు, అది అనే ద్వైతం లేదు. కావుననే అచట రాగద్వేషాల గందరగోళం
లేదు. అపుడు అందరం పరమాత్మలో లీనమై ఉంటాము. ఉదయం అతని నుండే బయటకు వస్తున్నాం మిథ్యారూపమైన
‘నేను’కు విలువను ఇవ్వక అంతా పరమాత్మ నుండి ఏర్పడినది కాబట్టి అంతా పరమాత్మయే అనే
భావనను సాధకుడు వృద్ధి చేసుకోవటం శ్రేయస్కరం.
No comments:
Post a Comment