Wednesday, 30 November 2016

స్వామీ సచ్చిదానంద బోధలు - 73



 అలలు, నురుగు నీటిని వీడి స్వతంత్రంగా లేవు. ఇవి నీటికన్నా వేరని గాని, వేరుకాదని గాని చెప్పలేము. కానీ ఇవి నీటికి అధీనం. అయితే, నీరు అలలకు, నురుగుకు అధీనంగా లేదు. పరమాత్మ నామరూపాలకు లొంగడు. నామరూపాలు పరమాత్మ ఆధీనంలో ఉన్నాయి. ‘సముద్రో హి తరంగః, క్వచన సముత్రో న తారంగః’ అలలు నురుగుల విలాస విజృంభణలపై దృష్టి పెడితే నీరు కనబడదు. ఇట్లాగే నామరూపాల విభ్రమకు లొంగినవారికి ఆత్మ కనబడడు. బాగా గమనిస్తే నీటిబుడగ, నురగ మాయ. నీరే సత్యం; నామరూపాలు మాయ, బ్రహ్మమే సత్యం.

No comments:

Post a Comment