Wednesday, 30 November 2016

స్వామీ సచ్చిదానంద బోధలు - 79



   ఆనందం బయట లేదు. అది నీలోనే ఉంది. కస్తూరి మృగం తనలోనే సుగంధం ఉందని తెలియక అరణ్యమంతా సుగంధానికై తిరిగినట్లు, నీలోనే ఆనందం ఉన్నా, గమనించకుండా అక్కడెక్కడో సుఖం ఉందని భ్రమించరాదు. ఆనందం నీలో ఉండటమే కాదు, ఆ ఆనందమే నీవు. కలకండను ఎటు ఆస్వాదించినా మధురంగా ఉండినట్లే నీ ఆత్మ ఆనందఘన స్వరూపం. ఉప్పు తిన్న చీమకు చక్కెర కూడా ఉప్పులా ఉండినట్లే సత్సాంగత్యం వలన నీవే అనందస్వరూపుడవు కాగలవు. విషయవాసన గలవారికి ఆనందస్వరూపమైన ఆత్మ రుచింపకున్నది.

No comments:

Post a Comment