రాగం, ద్వేషం మున్నగునవి మానవులను
పీడిస్తున్నాయి. ఇదే సంసారబంధం. ఒకసారి ఒక సాధువును ‘వైకుంఠానికి ఎవరు పోతారు?’
అని ఎవరో అడిగినందుకు, ఆ సాధువు ‘నేను పోతే పోతాను’ అన్నాడట. ఆ సాధువుకు ఎంత
అహంకారం ఉందని కొందరనుకున్నారు. కాని ఆ మాట విన్న జిజ్ఞాసువులు ‘నేను’ అనే మాటకు
అహంకారం అని గ్రహించాలి. ‘నేను పోతే – అంటే అహంకారం పోతే పోతాము’ అని గ్రహించారట.
No comments:
Post a Comment